ETV Bharat / state

కల్తీ నివారణకు కాసుల కొరత

author img

By

Published : Jan 2, 2020, 6:06 AM IST

Updated : Jan 2, 2020, 9:26 AM IST

మార్కెట్​లో కల్తీ ఆహారోత్పత్తుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వాటి నియంత్రణకు నిధుల కొరతే అసలు సమస్యగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రం ఉదారంగా నిధులిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయమందక పనులు ఆగిపోయాయి.

food processing industries in telangana
కల్తీ నివారణకు కాసుల కొరత
కల్తీ నివారణకు కాసుల కొరత
మార్కెట్‌లో విచ్చలవిడిగా సాగుతున్న కల్తీ ఆహారోత్పత్తుల అమ్మకాల నియంత్రణను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎలాంటి కల్తీలకు ఆస్కారం లేని నాణ్యమైన ఆహారోత్పత్తుల తయారీ కోసం సర్కారు మూడేళ్ల కిందట ప్రత్యేకంగా రాష్ట్ర ఉద్యాన సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ప్రభుత్వ ఉత్పత్తులు "విజయ" పాలు, వంట నూనెలు మాదిరిగా నాణ్యమైన సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులు తయారీ చేయాలనేది ఈ సంస్థ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం.

కల్తీ నివారణకు తెలంగాణ బ్రాండ్​ ఉత్పత్తులు
మొత్తం 8 రకాల ఆహారోత్పత్తులు తొలి ఏడాదే ఉత్పత్తి చేయాలని ఉద్యాన సంస్థ నిర్ణయించింది. రోజుకు 13 టన్నుల చొప్పున ఏడాదికి 3,250 టన్నులు ఉత్పత్తిచేసి చిల్లర మార్కెట్‌లో వినియోగదారులకు విక్రయించాలనేది లక్ష్యంగా నిర్దేశించింది. నిత్యావసరాలైన పసుపు, కారం పొడి, ధనియాల పొడి వంటి ఉత్పత్తులు తయారు చేసి తెలంగాణ బ్రాండ్​ పేరుతో ప్యాకింగ్​ చేయాలి. ఇవి మార్కెట్‌లోకి వస్తే ప్రైవేటు సంస్థలు విక్రయించే ఉత్పత్తుల నాణ్యత, ధరలో పోటీతత్వం ఏర్పడి కల్తీలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మైసూర్‌లోని కేంద్ర ఆహార సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఈ ప్లాంట్ ఏర్పాటుకు అధునాతన సాంకేతికతతో "సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్‌"ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఏడాదిన్నర క్రితం వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సీఎఫ్‌టీఆర్‌ఐలో అధ్యయనం చేసి వచ్చింది.

అభివృద్ధికి 18 నెలల గడవు.. ఆరుమాసాలైనా కదలని పనులు
మేడ్చల్ జిల్లా దూలపల్లిలో 16.56 ఎకరాల విస్తీర్ణం స్థలాన్ని ఈ సంస్థకు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక బాగుందని కేంద్రం సైతం ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో భాగగా ప్రత్యేకంగా 4.28 కోట్ల రూపాయలను గ్రాంట్‌గా గత జులై మాసంలో మంజూరు చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల్లోగా నిధులు ఇచ్చి ఖర్చు చేస్తేనే ఈ నిధులు ఇస్తామని షరతు విధించింది. ఇప్పటికే ఆరు మాసాలైనా రాష్ట్రం నిధులు కేటాయించక పోవడం వల్ల కేంద్ర నిధులూ వెనక్కిపోయే ప్రమాదం ఏర్పడింది.

మాటలే కానీ.. చేతలు లేవు
ఒకవైపు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావాలని, నిత్యావసర వస్తువులన్నీ స్థానికంగా కల్తీ లేకుండా తయారు చేయాలని ప్రత్యేక ఆహార శుద్ధి విధానం తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, మూడేళ్లుగా ఉద్యాన సంస్థకు రూ.26.38 కోట్లు సమకూర్చకపోవడం వల్ల ఆహారశుద్ధి ప్లాంటు భవన నిర్మాణానికి పునాదులైనా తవ్వలేదు.
టీఎస్ ఐపాస్‌ కింద ఈ ప్లాంటుకు పారిశ్రామిక రాయితీలు సైతం ఇవ్వడానికి పరిశ్రమల శాఖ అనుమతించింది. పనుల ప్రారంభానికి సంబంధించి టెండర్లు పిలవాలని శ్రీకొండా లక్ష్మణ్​ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అప్పగించామని రాష్ట్ర ఉద్యాన శాఖ ఎండీ వెంకటరామిరెడ్డి తెలిపారు. నిధులు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి అడిగామని, నిధులు రాగానే పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి : 'పుర'పోరుకు ఎస్​ఈసీ మార్గదర్శకాలు

02-01-2020 TG_HYD_04_02_FOOD_PROCESSING_UNIT_DELAY_PKG_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) కల్తీల నివారణకు నిధుల కొరత వేధిస్తోంది. మార్కెట్‌లో విచ్చలవిడిగా సాగుతున్న కల్తీ ఆహారోత్పత్తుల అమ్మకాలపై కఠినంగా వ్యహరించాలని నిర్ణయించిన సర్కారు... కార్యాచరణలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ఉత్పత్తులొస్తే... పోటీ, నాణ్యత పెరుగుతాయనే ఆశయానికి గండి పడినట్లవుతోంది. జాతీయ ఆహార సంస్థ సాంకేతిక పరిజ్ఞానం, డీపీఆర్‌ ఇవ్వడగా... 4.28 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది కేంద్రం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా 27 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో... కల్తీలేని ఆహారోత్పత్తుల తయారీ కోసం ఉద్యాన శాఖ రూపొందించిన ప్రణాళిక కార్యరూపం దాల్చడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. LOOK........... VOICE OVER - 1 మార్కెట్‌లో విచ్చలవిడిగా సాగుతున్న కల్తీ ఆహారోత్పత్తుల అమ్మకాలను నియంత్రించేందుకు నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన ఆహారోత్పత్తులు తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం అందక పనులు ఆగిపోయాయి. ఎలాంటి కల్తీలకు ఆస్కారం లేని నాణ్యమైన ఆహారోత్పత్తుల తయారీ కోసం సర్కారు మూడేళ్ల కిందట ప్రత్యేకంగా రాష్ట్ర ఉద్యాన సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ప్రభుత్వ ఉత్పత్తులు "విజయ" పాలు, వంట నూనెలు మాదిరిగా నాణ్యమైన సుగంధ దవ్యాల ఉత్పత్తులు తయారీ చేయాలనేది ఈ సంస్థ ఏర్పాటు ప్రధానోద్ధోశం. మొత్తం 8 రకాల ఆహారోత్పత్తులు తొలి ఏడాదే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. రోజుకు 13 టన్నుల చొప్పున ఏడాదికి 3250 టన్నులు ఉత్పత్తిచేసి చిల్లర మార్కెట్‌లో వినియోగదారులకు విక్రయించాలనేది లక్ష్యంగా నిర్థేశించిన విషయం విదితమే. ప్రజలంతా నిత్యావసరాలుగా వినియోగించే పసుపు పొడి, కారం పొడి, ధనియాలు పొడి, చింతపండు పొడి, అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద... ఇలా రకాలు ఉత్పత్తులు తయారు చేయాలి. ఆయా ఉత్పత్తులు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాలకు సైతం "తెలంగాణ బ్రాండ్" పేరిట ప్యాకింగ్‌ చేసి విక్రయించాల్సి ఉంది. ఇవి మార్కెట్‌లోకి వస్తే ప్రైవేటు సంస్థలు విక్రయించే ఉత్పత్తుల నాణ్యత, ధరలో పోటీతత్వం ఏర్పడి కల్తీలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. మైసూర్‌లోని కేంద్ర ఆహార సాంకేతిక పరిజ్ఞాన పరిశోధన సంస్థ - సీఎఫ్‌టీఆర్‌ఐ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో "సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్‌"ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ సంస్థలో ఇప్పటికే అనేక రకాల ఆహారోత్పత్తులు నాణ్యంగా సులభంగా తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునాతన యంత్రాలు ఉన్నాయి. ఏడాదిన్నర కిందట వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం మైసూరు వెళ్లి ఆ సంస్థలో అధ్యయనం కూడా చేసి వచ్చింది. ఆ ఉత్పత్తుల తయారీకి మేడ్చల్ జిల్లా దూలపల్లిలో ప్రత్యేకంగా 16.56 ఎకరాల విస్తీర్ణం స్థలం సైతం ఈ సంస్థకు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక బాగుందని కేంద్రం సైతం ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఉదారంగా 4.28 కోట్ల రూపాయలు గ్రాంట్‌గా గత జులై మాసంలో మంజూరు చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల్లోగా నిధులు ఇచ్చి ఖర్చు చేస్తేనే ఈ నిధులు ఇస్తామని కేంద్రం షరతు విధించింది. ఆ నిబంధనే అసలుకు ఎసరొచ్చింది. ఇప్పటికే ఆరు మాసాలైనా రాష్ట్రం నిధులేమీ ఇవ్వలేదు. VOICE OVER - 2 ఈ ప్లాంట్ ఏర్పాటు, ఇతర పనులకు 26.36 కోట్ల రూపాయలు కేటాయించాలని 2017-18, 2018-19 రాష్ట్ర బడ్జెట్లకు ఉద్యాన శాఖ ప్రతిపాదనలు ఇచ్చింది. కానీ, ఏమీ ఇవ్వకపోవడంతో ఇక 2019-20 సంవత్సరంలో బడ్జెట్ సందర్భంగా కనీసం ప్రతిపాదనలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా కేంద్రం కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు, రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావాలని ప్రజల నిత్యావసరాలన్నీ స్థానికంగా నాణ్యత, కల్తీ లేకుండా తయారు చేయాలని ప్రత్యేక ఆహార శుద్ధి విధానం తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, మూడేళ్లుగా ఉద్యాన సంస్థకు 26.38 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో కీలకమైన ఉద్యాన సంస్థ ఆహార శుద్ధి ప్లాంటు భవన నిర్మాణానికి పునాదులు కూడా తవ్వలేదు. టీఎస్ ఐపాస్‌ కింద ఈ ప్లాంటుకు పారిశ్రామిక రాయితీలు సైతం ఇవ్వడానికి పరిశ్రమల శాఖ కూడా అనుమతించింది. ఈ అంశంపై ఉద్యాన శాఖ ఎండీ లోక వెంటకరామిరెడ్డిని వివరణ అడగ్డా... నిధులు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ అడిగినట్లు తెలిపారు. పనుల ప్రారంభానికి సంబంధించి టెండర్లు పిలవాలని శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అప్పగించామని... నిధులు రాగానే పూర్తి చేస్తామని ఎండీ పేర్కొన్నారు.
Last Updated : Jan 2, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.