హైదరాబాద్‌లోని పేదలు, కూలీలకు ఆదిత్య కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్యర్వంలో గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్‌లో 2వేల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి రోజు ఒక వెయ్యి నుంచి 2వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకుడు నంద కిషోర్ బిలాల్ తెలిపారు.
ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉన్నపుడే వైరస్‌ను పూర్తిగా నివారించవచ్చని.. ప్రభుత్వం ఆదేశాలను అందరూ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'