సికింద్రాబాద్‌లో రోడ్డు, ఫుట్‌పాత్‌లపై ఆకలితో అలమటిస్తున్న పేదలు, యాచకులకు వీఎన్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వల్లం నవీన్ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. బోయిన్పల్లి, ట్యాంక్‌బండ్, మేడ్చల్ హైవే ప్రాంతంలో సుమారు 200 ఆహార ప్యాకెట్లను పేద ప్రజలకు అందజేసినట్లు ఆయన తెలిపారు.
లాక్ డౌన్ కొనసాగుతున్నందున రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు, రోడ్లపై ఉండే యాచకులకు దిక్కులేకుండా సతమతమవుతున్నారని.. వారి కడుపు నింపేందుకు తాను ఆహారం అందించినట్లు నవీన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది