ETV Bharat / state

'లంగర్ హౌస్ పాప కొడంగల్​లో దొరికింది...' - father

హైదరాబాద్​లో అపహరణకు గురైన ఐదేళ్ల చిన్నారి ఎట్టకేలకు దొరికింది. పాపను కొడంగల్​ పోలీస్​స్టేషన్​కు సీఐ నాగేశ్వరరావు తీసుకువచ్చారు. చిన్నారి ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

'లంగర్ హౌస్ పాప కొండగల్​లో దొరికింది...'
author img

By

Published : Jul 11, 2019, 11:52 AM IST

Updated : Jul 11, 2019, 4:15 PM IST

హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ ప్రశాంత్‌నగర్‌లో అపహరణకు గురైన ఐదేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. నిన్న మధ్యాహ్నం లంగర్‌హౌస్‌ పీఎస్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఐదేళ్ల బాలికను ఓ వ్యక్తి అపహరించాడు. పాఠశాల నుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడే ఉన్న వృద్ధుడు పాపను ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు పాపను అపహరించిన వ్యక్తి ఆచూకీని కనిపెట్టారు. కిడ్నాప్​ చేసిన వ్యక్తి వికారాబాద్​ జిల్లా కొడంగల్​కు చెందిన ఫకీరప్పగా గుర్తించారు. పాపను కొడంగల్​ పోలీస్​స్టేషన్​కు సీఐ నాగేశ్వర్​రావు తీసుకొచ్చారు. పాప ఒంటిపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించగా... చిన్నారికి చికిత్స చేయించారు.

'పాప దొరికింది... తండ్రే కిడ్నాప్​ చేయించాడు'

ఇదీ చూడండి: హైదరాబాద్​లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్​​

Last Updated : Jul 11, 2019, 4:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.