Ministers will go munugode: సీఎం ఆదేశాల మేరకు రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు వెళ్లనున్నారు. ఉపఎన్నికలో ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. మునుగోడు అభివృద్ధి, సంక్షేమ పనులపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు వెళ్లి సమీక్షించనున్నారు. మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా కొనసాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇవీ చదవండి: