ETV Bharat / state

Ap Govt: 'మరో ఏడాది పాటు వారికి ఐదు రోజుల పనివిధానమే' - ఏపీ తాజా వార్తలు

ఏపీలోని అమరావతి పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap government
ap government
author img

By

Published : Jun 28, 2021, 10:54 PM IST

ఏపీలో అమరావతి పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పని వేళల్ని నిర్దేశించారు. మరో వైపు జూన్ 27 నుంచి ఏడాది పాటు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ పిల్లల విద్య, ఉద్యోగాల లాంటి కారణాలతో హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి పూర్తిగా తరలిరానందున మరో ఏడాదిపాటు ఐదు రోజుల పనిదినాల వెసులుబాటును కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చూడండి: MP KOMATI REDDY: 'రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.