ETV Bharat / state

తొలిరోజు ప్రశాంతం.. గంట ముందే పరీక్ష కేంద్రాలకు - inter first year exams in hyderabad

హైదరాబాద్​ వ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక్క నిమిషం నిబంధన కారణంగా సుమారు గంట ముందే తల్లిదండ్రులతో సహా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఇంటర్​ బోర్డు పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

INTER EXAMS
తొలిరోజు ప్రశాంతం.. గంట ముందే పరీక్ష కేంద్రాలకు
author img

By

Published : Mar 4, 2020, 7:23 PM IST

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సర​ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం నిబంధన కారణంగా హైదరాబాద్​ వ్యాప్తంగా సుమారు గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. వారి సాయంగా పలువురు తల్లిదండ్రులు వచ్చారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ఇంటర్​ బోర్డు పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.

పాతబస్తీ, ఫలక్​నూమ, చంద్రాయణగుట్ట, జహ్నుమ, శంషీర్​గంజ్​ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు చేరుకున్నారు. సికింద్రాబాద్​లోని కళాశాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు పటిష్ఠ ఏర్పాటుచేశారు. సుమారు గంట ముందే విద్యార్థులంతా కేంద్రానికి చేరుకున్నారు. మెహదీపట్నంలో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

తార్నాకలోని నారాయణ కళాశాల, లేజ్​ డేవిడ్​ మెమోరియల్ స్కూల్​ ట్రాఫిక్​లో ఇరుక్కోకుండా ఉండేందుకు సుమారు గంట ముందుగానే విద్యార్థులంతా కేంద్రాలకు చేరుకున్నారు. అబిడ్స్​, నారాయణగూడ, హిమాయత్​నగర్​లోని ఆయా కేంద్రాలకు ఉదయం 8 గంటలకే విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకున్నారు.

తొలిరోజు ప్రశాంతం.. గంట ముందే పరీక్ష కేంద్రాలకు

ఇవీచూడండి: మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్​ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.