సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏజీ ఆఫీస్ ఎదురుగా ఉన్న తారమండల్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని ఐదో అంతస్థులోని మహా ఎలక్ట్రికల్ కార్యాలయంలో మంటలు చెలరేగగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
ఐదో అంతస్థులో ఉన్న 30 మంది ఉద్యోగులను పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇదీ చూడండి: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం