హైదరాబాద్ లిబర్టీలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా సాగర్ వ్యూ కాంప్లెక్స్ టెర్రస్‌పై వాచ్మెన్ వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో అక్కడే విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన కాంప్లెక్స్‌పైకి చేరుకుని... వాటర్ ట్యాంక్‌లోని నీటి సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో టెర్రస్‌పై ఉన్న తలుపు, స్క్రాప్ అగ్నికి ఆహుతి అయ్యింది.
ఇదీ చదంవండి:'ఎయిర్ ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు