ETV Bharat / state

'ట్విట్టర్, ఫేస్​బుక్ సీఈవోలపై కేసు నమోదు చేయాలి'

భారత జవాన్​లపై విష ప్రచారం చేస్తున్న వారిపై, ఆయా సమాచారం తొలగింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్ బుక్​లపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని  హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ డీజీపీని కోరారు.

విష ప్రచారాలు చేస్తున్న వారిని కట్టడి చేయడంలో ట్విట్టర్ , ఫేస్​ బుక్ విఫలం : న్యాయవాది
author img

By

Published : Aug 8, 2019, 9:12 PM IST

ట్విట్టర్, ఫేస్​బుక్ సీఈవోలపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డీజీపీకి హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 370 ఆర్టికల్ రద్దుపై సామాజిక సాధనాల ద్వారా దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని ప్రోత్సహిస్తున్న ఫేస్​బుక్, ట్విట్టర్ సీఈవోలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ట్విట్టర్, ఫేస్​బుక్​లను వేదికగా చేసుకుని భారత ఆర్మీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని కట్టడి చేయడంలో ఈ రెండు సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ విషయంపై ఇప్పటికే మెయిల్ ద్వారా ఫేస్​బుక్, ట్విట్టర్ సీఈఓలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర మూకలకు కొమ్ముకాస్తూ ఆర్మీపై అసత్య ప్రచారాలు చేస్తున్న సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

విష ప్రచారాలను కట్టడి చేయడంలో ట్విట్టర్ , ఫేస్​ బుక్ విఫలం : న్యాయవాది
ఇవీ చూడండి : నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన

DATE - 08-08-2019 TG_Hyd_47_08_Complante On Twitter Facebook_Ab_TS10005 NOTE - FEED Etv Bharat Contributor: Bhushanam యాంకర్ - ట్విట్టర్, ఫేస్ బుక్ సీఈవో లపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ తెలంగాణ డీజీపీ కి ఫిర్యాదు చేశారు. 370 ఆర్టికల్ రద్దు తో యావత్ భారతదేశం లో ఉన్న ప్రజలు సంబరాలు చెసుకుంటుంటే.. సోషల్ మీడియా ద్వారా దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై.. వాటిని ప్రోత్సహిస్తున్న ఫేస్ బుక్ సీఈవో జుకెన్ బర్గ్,ట్విట్టర్ సీఈవో జాక్ ప్యాట్రిక్ పై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ వేదిక గా చేసుకుని భారత్ ఆర్మీ పై తప్పుడు ప్రసారాలు చేస్తున్న వారిని కట్టడి చేయడంలో ఈ రెండు సోషల్ మీడియా సంస్థలు విఫలమయ్యాయన్నారు. ఈ విషయం ఇప్పటికే మెయిల్ ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్ సీఈఓ లకు పిర్యాదు చేసిన స్పందించలేదన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత మూకల కొమ్ముకాస్తూ..దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా.. భారత ఆర్మీ పై అసత్య ప్రచారాలు చేస్తూ భారత దేశానికి ద్రోహం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ డీజీపీని విజ్ఞప్తి చేశారు. బైట్ - అరుణ్ కుమార్ - ( హైకోర్టు న్యాయవాది )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.