Buggana Rajendra comments on Polavaram: పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆలస్యమైందని ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. కాఫర్ డ్యామ్‌లో గ్యాప్‌లు వదిలేయటం వల్లే డయాఫ్రాం వాల్ దెబ్బతిందని ఆయన స్పష్టం చేశారు. ఆ గోతులు పూడ్చేందుకు సమయం పడుతోందని అందుకే ప్రాజెక్టు ఆలస్యమవుతోందన్నారు.
ప్రస్తుత రేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోడానికి సమయం పడుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ పాత రేట్లతోనే ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నిచటం వల్లే నిర్మాణం ఆలస్యమైనట్టు పేర్కొన్నారు. మరోవైపు గత ప్రభుత్వ హాయంలోనే ఎక్కువ అప్పులు చేశారని.. మాజీ ఆర్ధిక మంత్రి యనమల పెద్ద అప్పుల మంత్రి అయితే చంద్రబాబు అబద్ధాల నాయుడని మంత్రి ఆక్షేపించారు.
శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే రాయలసీమ ప్రాంత వాసులు కోరుతున్నారన్నారు. అప్పట్లో రాజధాని వదిలేసిన పెద్ద మనసు కర్నూలు వాసులదని మంత్రి వ్యాఖ్యానించారు. పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వైసీపీ, బీజేపీలు అనుకూలమేనని బుగ్గన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: