Fashion Walk: కరోనా కారణంగా నిలిచిపోయిన ఫ్యాషన్ వాక్ ఆడిషన్స్... మళ్లీ ప్రారంభమయ్యాయి. ఫ్యాషన్ మోడల్స్ కోసం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన ఆడిషన్స్‌లో... వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యాజువల్, వెస్ట్రన్ స్టైల్ దుస్తులు ధరించి... చిన్నారుల నుంచి యువత వరకు తమ ప్రతిభను ప్రదర్శించారు.
ర్యాంపుపై హొయలు...
మిస్ విభాగంలో నిర్వహించిన అందాల పోటీల్లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల దుస్తులు ధరించి... ర్యాంప్‌పై హొయలొలికించారు. క్యాట్ వాక్ చేస్తూ అందచందాలతో అలరించారు. విభిన్న రకాల జాకెట్స్, టర్టిల్ నెక్ టీషర్ట్స్, ఫార్మల్స్, సెమీ ఫార్మల్స్ ధరించి ర్యాంప్‌పై వాక్ చేసి అదరహో అనిపించారు.
చిన్నారుల ప్రదర్శన...
ఎఫ్డబ్యూఎం-ఫస్ట్ వాక్ మోడలింగ్ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో... చిన్నారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలర్‌ఫుల్ డ్రెస్సులు వేసుకుని బుడిబుడి అడుగులు వేస్తూ ర్యాంప్‌పై చేసిన ప్రదర్శన విశేషంగా అలరించింది. కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ వాక్ ఫ్యాషన్ వీక్ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫస్ట్ వాక్ మోడలింగ్ సంస్థ నిర్వాహకులు సాయి కిరణ్ తెలిపారు. వివిధ నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి.. దేశవ్యాప్తంగా ఫైనల్స్ నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి : Palle Pragathi Funds: 'కేంద్రం గ్రాంట్ ఇవ్వలేదు.. అయినా నిధులు విడుదల చేశాం..'