వసతి గృహాల్లో సమస్యలు... అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈనాడు కథనాల ఆధారంగా జస్టిస్ నవీన్ రావు రాసిన లేఖలను ప్రజా ప్రయోజన వ్యాజ్యలను పరిగణించిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక, మహిళ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, సాంఘిక సంక్షేమ అధికారులను ఆదేశించింది.
నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి... అమ్మాయి అని తేలితే.. భ్రూణ హత్యలకు పాల్పడుతున్న అంశంపై మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని.. అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 6కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రానికి కేసీఆర్ లేఖ'