ETV Bharat / state

పరీక్షా కాలం..! - STUDENTS

ఇంటర్​ పరీక్షలకు విద్యార్థులతోపాటు అధికారులూ సిద్ధమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పరీక్షలు జరపాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమయానికి ఒక్కసెకను ఆలస్యమైనా... కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించమని అధికారులు అంటున్నారు.

ఇంటర్​... పరీక్షలు ఎంటర్!
author img

By

Published : Feb 27, 2019, 6:41 AM IST

Updated : Feb 27, 2019, 7:23 AM IST

నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1277 కేంద్రాల్లోపరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేయగా... 9 లక్షల 42 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న పరీక్షకు... ఒక్క నిమిషం ఆలస్యమైనా హాలులోకి అభ్యర్థులను అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్​కుమార్​ స్పష్టం చేశారు.

భద్రత నడుమ పరీక్షలు
విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి హాల్ టికెట్లను ఆన్‌లైన్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్​కు పాల్పడితే డిబార్​తో పాటు.. క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. 24 వేల 508 మంది ఇన్విజిలేటర్లను నియమించగా.. 50 మంది ఫ్లయింగ్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్​లు అదనంగా పనిచేయనున్నారు.
మంత్రి ఆదేశాలు...
అంతకుముందు అశోక్​ కుమార్​తో విద్యాశాఖమంత్రి జగదీశ్​రెడ్డి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిచారు. ​పరీక్ష కేంద్రాల్లో విధి నిర్వహణలో ఉన్న ఏ సిబ్బంది చరవాణులు వాడకూడదని మంత్రి ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలుపర్చాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:పాక్​పై ద్వేషం లేదు

sample description
Last Updated : Feb 27, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.