ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు తాను అవినీతిపై పోరాటం చేస్తానని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే... అప్పుల రాష్ట్రంగా మార్చారని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. 24వేల కోట్ల రూపాయల విలువైన బీటీ రహదారుల కాంట్రాక్ట్ ఒకే సంస్థకు కట్టబెట్టేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని ఆరోపించిన కేసీఆర్... నేడు ఆ రాష్ట్ర గుత్తేదారులకు స్వయంగా దోచి పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దేశంలో ఎక్కడ జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లను చేసేలా కేసీఆర్ పాలన ఉందని ఆరోపించారు.
ఇవీ చూడండి : ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన