ETV Bharat / state

మినీ పురపోరు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - mini municipal elections counting latest update

మినీ పురపోరు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 30న జరిగిన పోలింగ్‌కు సంబంధించి కాసేపట్లో లెక్కింపు ప్రారంభం కానుంది. వీటితో పాటే పలు మున్సిపాలిటీల్లోని వార్డులకు జరిగిన ఉప ఎన్నికల తీర్పు కూడా వెలువడనుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మినీ పురపోరు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

author img

By

Published : May 3, 2021, 4:21 AM IST

మినీ పురపోరు ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. రెండు నగరాలు, ఐదు పట్టణాల్లో ఏ పార్టీ పాగా వేయనుందో ఇవాళ తేలి పోనుంది. గ్రేటర్‌ వరంగల్‌కు సంబంధించి.. నగర శివారులోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో లెక్కింపు జరగనుంది. 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి.. లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన తర్వాత.. బ్యాలెట్ పెట్టెల్లోని ఓట్లు లెక్కిస్తారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది.

ఖమ్మంలో..

ఇక ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి ఎస్​.ఆర్​. అండ్‌ బీజీఎన్​ఆర్ కళాశాలలో లెక్కింపు జరగనుంది. 60 డివిజన్లకు గానూ.. 10వ డివిజన్‌ను తెరాస ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో.. 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. లెక్కింపు కోసం ప్రతి డివిజన్‌కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. మొత్తం 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్‌కు ఓ సూపర్ వైజర్‌ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు.

మహబూబ్​నగర్​ జిల్లా..

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కోసం అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. జడ్చర్ల పురపాలిక లెక్కింపు బీఆర్​ఆర్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగనుంది. 27 వార్డులు ఉండగా.. 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అచ్చంపేట పురపాలిక లెక్కింపు.. జేఎంజే ఉన్నత పాఠశాలలో చేపట్టనున్నారు. ఇక్కడ 20 వార్డులకు సంబంధించి నాలుగు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. కొత్తూరు పురపాలికకు కేజీబీవీ పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు రౌండ్లలో కొత్తూరు ఫలితాలు రానున్నాయి. తొలిసారి ఎన్నికలు జరిగిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ 20 వార్డుల్లో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43వార్డులకు గానూ 236 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్ వీఎం హోంలో జరగనుంది. ఈ ఎన్నికలో పోటీకి తెరాస దూరంగా ఉంది. నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్ మున్సిపాలిటీల్లోని ఒక్కొక్క వార్డుకు జరిగిన ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి: నాగార్జున సాగర్​లో తెరాసకు పెరిగిన ఓట్ల శాతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.