రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకులను మెరుగుపరచుకోవాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. యూనివర్సిటీల ప్రమాణాలు, ర్యాంకులు మెరుగుపడేలా ప్రోత్సహిస్తామని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం అధికారులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. ప్రతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉండాలన్నారు. ఆన్లైన్ వనరులను రూపొందించి యూనివర్సిటీ డేటాబేస్లో అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాలని.. స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
ఇదీ చదవండి: యూనివర్సిటీ విద్యలో సమూల ప్రక్షాళన: గవర్నర్