ETV Bharat / state

Telangana News Today టాప్​ న్యూస్​ 7PM - Etv bharat telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు

7pm
7pm
author img

By

Published : Aug 14, 2022, 6:59 PM IST

  • ప్రపంచానికే ఆదర్శంగా మన దేశం కొనసాగాలన్న మంత్రి కేటీఆర్‌

KTR in Azadi ka Amrit Mahotsav Program సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ సైనికులు రెండు రోజుల పాటు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి.. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలి నొప్పితో బాధపడుతున్న కేటీఆర్.. 3 వారాల అనంతరం ఈ కార్యక్రమానికి హాజరై సుమారు గంటన్నర పాటు గడిపారు.

  • తుపాకి పేల్చితే రాజీనామా చేయాలా, విపక్షాలపై మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఫైర్​

MINISTER SRINIVAS GOUD మహబూబ్​నగర్​లో తుపాకీ పేల్చడంపై విపక్షాల ఆరోపణలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. సాధారణంగా ఒక ఘటన సంభవిస్తే విచారణ అంటూ ఉంటుందని... తాను పేల్చింది రబ్బరు బుల్లెట్ అని మంత్రి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో జరిగిన సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

కరోనా దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. దీని బారిన సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులు పడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌లో వెల్లడించారు. తనను కలసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని రేవంత్‌ సూచించారు.

  • విజయాలను చూసి అందరూ గర్వపడాలన్న వెంకయ్య

Venkaiah Naidu on Azadi ka Amrit Mahotsav రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ స్వర్ణభారత్ ట్రస్ట్‌ హైదరాబాద్ చాప్టర్‌లో స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా కార్యక్రమ ప్రచార వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శిక్షణార్థులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

  • నిద్ర సరిగ్గా పట్టనివాళ్లు ఈ చిట్కాలు పాటించేయండి

Deep Sleep Tips: ఆరోగ్యమయ జీవితానికి రోజూ ఏడు గంటల నాణ్యమైన నిద్ర అవసరమని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అన్ని గంటలు మంచంపైనే ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టని వాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లు ఈ నియమాలు పాటిస్తే మార్పు ఉంటుంది.

  • చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి

Cairo church fire accident : చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన.

  • ఆ కంపెనీల షేర్లతో కాసుల పంట పండించిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala Stock Market రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరణంతో ​భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. ఈక్విటీల్లోకి ఎంటర్‌ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. రాకేశ్​ ఝున్‌ఝున్‌వాలాకు లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు గురించి ఓ సారి తెలుసుకుందాం. అలాగే ఆయన ఎదిగిన తీరును చూద్దాం.

  • కొద్దిరోజుల్లో ఆసియా కప్ షురూ​, ఈ విషయాల గురించి తెలుసా

Asia Cup 2022 Schedule క్రికెట్​ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్​ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 27న శ్రీలంక, అఫ్గానిస్థాన్​ మ్యాచ్​తో టోర్నీ ప్రారంభం కానుండగా.. అసలైన భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ మరుసటి రోజు జరగనుంది. మరి ఈ టోర్నీ షెడ్యూల్​, స్క్వాడ్స్​ సహా ఆసియా కప్​ రికార్డులపై ఓ లుక్కేద్దాం.

  • మెగా ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​, ఆ సూపర్​హిట్​ సినిమా రీరిలీజ్​

మెగాస్టార్‌ అభిమానులకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ గుడ్​ న్యూస్​ చెప్పింది. చిరంజీవి సూపర్​హిట్​ సినిమా ఇంద్రను నేటి టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది గ్రాండ్‌ లెవల్‌లో మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

  • సీతారామం సినిమా స్టోరీకి ఆ ఉత్తరమే ఆధారమట

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్​ మృణాల్​ ఠాకూర్​ జంటగా తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోహీరోయిన్ల నటనకు సినీప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా హిట్​ టాక్​తో ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో అన్నిచోట్ల మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా యువ కథానాయకుడు తేజ సజ్జ.. సీతారామం హీరోహీరోయిన్లతో పాటు చిత్ర దర్శకుడు హను రాఘవపూడితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగా అసలు సీతారామం కథ ఎలా పుట్టింది? స్క్రిప్ట్​ ఎప్పుడు మొదలుపెట్టారు? లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే తీయడానికి కారణాలు? వంటి ఆసక్తికర విశేషాలను హను రాఘవపూడి పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.