Etela Rajender visit EX MP Chandrasekhar House : మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్ పార్టీ వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటల.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని.. వారికి ఉమ్మడిగా ఎజెండా ఉందని ఈటల రాజేందర్ అన్నారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు బీజేపీ కమిట్మెంట్తో ఉందన్నారు. కర్ణాటకలో హామీ ఇచ్చామని.. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించడంలో కలిసి పనిచేస్తామని అన్నారు.
Chandrasekhar Speech after Meet Etela : పార్టీ వీడుతారని మీడియా విషప్రచారం చేస్తోందన్నారు. వరంగల్ ప్రాంతం వరకే మోదీ మీటింగ్ జరిగిందని స్పష్టం చేశారు. అందుకే చంద్రశేఖర్‌కి మోదీని కలిసేందుకు పాస్ రాలేదని తెలిపారు. అంతే తప్ప మరొక అంశం ఇందులో ఇమిడి లేదని అన్నారు. పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే ఈ భేటీలో చర్చ చేశామని.. మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. ఈటల రాజేందర్ తనకి ఏమి చెప్పలేదని.. తాను పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈటలకు చెప్పానన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే అంశాలపైనే చర్చించామని తెలిపారు.
"నేను మాజీ ఎంపీ చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో కలిసి ఉత్సహంగా పాల్గొన్నాం. అలానే ఇప్పుడు బీజేపీ పార్టీలో కలసి పనిచేస్తున్నాం. అన్నింటి కన్నా ముఖ్యంగా మా ఇద్దరికి ఉమ్మడిగా ఓ అజెండా ఉంది. అది కేసీఆర్‌ని అధికారం నుంచి తొలగించడమే. మేమందరం ఒక ఆశయంతో కలసి పని చేస్తున్నాం. చంద్రశేఖర్ చాలా ఉన్నతమైన నాయకుడు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణకు కట్టుబడి ఉంటాం. పార్టీ మారడం అనేది బట్టలు మార్చుకున్నంత సులభం కాదు." - ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్
"పార్టీలో జరుగుతున్న విషయాల పట్ల ఈటల రాజేందర్, నేను చర్చించుకున్నాం. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లానే అంశాలనే మాట్లాడుకున్నాం. ఉద్యమంలో 14సంవత్సరాలు ఎమ్మెల్యే, మంత్రుల పదవికి రాజీనామా చేశాం. అంత కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం బాగుండాలనుకునే వ్యక్తుల్లో ఈటల, నేను మొదటి వరుసలో ఉంటాం. తెలంగాణ అభివృద్ధి అంశాలపైనే ఎక్కువగా చర్చించుకున్నాం."- చంద్రశేఖర్, మాజీ మంత్రి
ఇవీ చదవండి :