ETV Bharat / state

విశాఖ రైల్వే జోన్​ అంచనా వ్యయం మంజూరు చేసిన రైల్వే శాఖ - రైల్వే శాఖ

VISAKHA RAILWAY ZONE : విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాలకు అంచనా వ్యయం మంజూరు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

విశాఖ రైల్వే జోన్‌
విశాఖ రైల్వే జోన్‌
author img

By

Published : Feb 11, 2023, 11:48 AM IST

VISAKHA RAILWAY ZONE : విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కేంద్ర కార్యాలయం, ఇతర అవసరాలకు106.89 కోట్ల రూపాయలు అంచనా వ్యయం మంజూరు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఇప్పటికే భూమి గుర్తించినట్లు తెలిపింది. సర్వే, లేఅవుట్‌ ప్లాన్‌, సిబ్బంది నివాస కాలనీ, ఇతర నిర్మాణాల.. ప్రాథమిక పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు.. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు.

2022-23లో జోన్‌ ఏర్పాటు కోసం 7.29 లక్షల రూపాలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. జోన్‌ కోసం డీపీఆర్‌ సిద్ధమైందన్నారు. ఈమేరకు వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు భాగస్వామ్యంతో.. 17,073 కోట్ల వ్యయంతో ఏపీలో 7 ప్రాజెక్టులను రైల్వే చేపట్టిందని ఆయన చెప్పారు.

వీటిపై ఇప్పటివరకు 7,732 కోట్లు ఖర్చు చేసినట్లు.. మంత్రి మరో ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో.. వివరించారు. ఈ ప్రాజెక్ట్‌లలో తమ వాటాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,723 కోట్లు బకాయి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 2022 ఏప్రిల్‌ 1 నాటికి.. ఏపీలో 31 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీటిలో 16 కొత్త లైన్‌లు, 15 డబ్లింగ్ పనులు ఉన్నట్లు..మంత్రి చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.