కరోనా కష్టకాలంలో భాగ్యనగరంలో సేవా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలకు తోడుగా రాజకీయ నాయుకులు ఎక్కడికక్కడ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఇలాగే శ్రీకృష్ణ సేవా సంస్థాన్, రేణుక ఎల్లమ్మ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో సైదాబాద్‌లోని ఎలమ్మగుడి వద్ద 350 మందికి, కేబీఆర్ పార్కు వద్ద 250 మంది పేదలకు, వలసకూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కరోజే కాక రోజూ తమ స్థోమతకు తగినట్లు సహాయాన్ని అందిస్తున్నట్లు ఆధ్యాత్మివేత్త కృష్ణచాముండేశ్వరి మహర్షి తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా వేళ కేంద్రం కోత.. రాష్ట్రాన్ని నడిపేదెట్టా?