ETV Bharat / state

Engineering colleges: ఏడాది ఫీజులన్నీ ఒకేసారి! ఇంజినీరింగ్‌ కళాశాలల ఇష్టారాజ్యం.. - తెలంగాణ తాజా వార్తలు

కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు తెరవగానే ఫీజులన్నీ ఏకమొత్తంగా వసూలు చేయడానికి సంసిద్ధమయ్యాయి. ట్యూషన్‌, రవాణా, హాస్టల్‌, ల్యాబ్‌ తదితర రుసుములన్నీ కలిపి ఒకే విడతలో చెల్లించకపోతే కళాశాలకు రానిచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు భారం పడుతోంది. అంతమొత్తం ఒకేసారి ఎలా చెల్లించగలమని వారు వాపోతున్నారు.

fee
fee
author img

By

Published : Sep 13, 2021, 8:15 AM IST

జేఎన్‌టీయూ పరిధిలో 148 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఇందులో వంద వరకు హైదరాబాద్‌ చుట్టుపక్కలే ఉన్నాయి. ప్రస్తుతం రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు తరగతులు ప్రారంభించాయి. గతంలో ఫీజులను రెండు, మూడు విడతల్లో చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించేవి. వెసులుబాటు కల్పించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో కటువుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు తెరవగానే ఫీజులన్నీ ఏకమొత్తంగా వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు భారం పడుతోంది.

ఆ ఉత్తర్వులు వర్తించవా?

ఫీజులు పెంచవద్దని, నెలవారీగా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులు పాఠశాలలకే పరిమితమయ్యాయి. కొవిడ్‌ నేపథ్యంలో కళాశాలలు ఏ మేరకు నడుస్తాయో తెలియకున్నా, ఏడాది ఫీజులు ఒకేసారి చెల్లించాలనడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి.. నిర్దిష్టమైన విధానాలు జారీ చేయాలని కోరుతున్నారు. ‘అధ్యాపకులు, బోధన, ల్యాబ్‌ తదితర వసతులపై పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకునే వరకే మా పాత్ర ఉంటుంది. ఫీజుల విషయంలో ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి’ అని జేఎన్‌టీయూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: SCHOOL FEE : ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు.. ఫీజులు దండుకుంటున్న స్కూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.