ETV Bharat / state

'భారత్‌ జోలికొస్తే ఊరుకోం.. ముప్పుందని తెలిస్తే తిప్పికొట్టేందుకు రెడీ' - విశాఖ నేవిడే

Biswajit Dasgupta about Agnipath: దేశ పరిస్థితులకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురైతే ఎలాంటి పరిస్థితులనైనా సరే.. తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈఎన్‌సీ వైస్‌ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా పేర్కొన్నారు. అగ్నిపథ్ తొలిబ్యాచ్​ ఎంపికకు అభ్యర్థులను పిలిచినట్లు ఆయన తెలిపారు. మహిళల శాతం నావికాదళంలో పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

Biswajit Dasgupta about Agnipath
Biswajit Dasgupta about Agnipath
author img

By

Published : Dec 3, 2022, 7:22 PM IST

Biswajit Dasgupta about Agnipath : అగ్నిపథ్​ తొలి బ్యాచ్​ ఎంపికకు అభ్యర్థులను పిలిచినట్లు తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో 3వేల 474 మందిని శిక్షణకు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. అందులో 10 శాతం మహిళలు ఉన్నారని అన్నారు. నేవీడే సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్​ శిక్షణ పూర్తైనా తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరతారని వెల్లడించారు.

అండర్‌వాటర్ డొమైన్‌లో వ్యూహాత్మక విధానంపై.. అండర్‌వాటర్ డొమైన్‌లో మానవరహిత పరికరాలపైనా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అణు జలాంతర్గామి అరిహంత్‌ ఇప్పటికే సేవల్లో ఉందని అన్నారు. భవిష్యత్తులో మరో అణు జలాంతర్గామిని సమకూర్చుకుంటామని ప్రకటించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా 38 నౌకలు తయారీలో ఉన్నాయన్నారు. దక్షిణ శ్రీలంకలో చైనా పోర్టుపై సమీక్షిస్తున్నామని.. అనేక దేశాల్లో చైనా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోందని అన్నారు.

శ్రీలంకలోనూ అలాగే బేస్ ఏర్పాటు చేసుకుందని.. దేశానికి ముప్పు వాటిల్లే పరిస్ధితులు వస్తే ఎలాంటి పరిస్థితులనైనా సరే తిప్పికొట్టేందుకు సిద్ధంగా వున్నామనీ ప్రకటించారు. మిలిటరీ ఎయిర్‌బేస్ కోసం విశాఖ విమానాశ్రయం నిర్మించారని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయానికి భోగాపురం ప్రత్యామ్నాయం కానుందని అన్నారు. శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టుపై తూర్పు నౌకదళ నిఘా ఉంటుందని వెల్లడించారు. నావికాదళంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరుగుతోందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.