ETV Bharat / state

service sector:సేవారంగంలో పెరిగిన ఉద్యోగిత శాతం.. అయిదేళ్లలో మారిన చిత్రం

రాష్ట్రంలో సేవా రంగంలో ఉద్యోగిత శాతం పెరిగింది. స్థిరాస్తి వ్యాపారం, పరిశ్రమల ద్వారా ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. అత్యధికులు సేవా రంగంలో ఉపాధి పొందుతున్వట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ అధ్యయనంలో వెల్లడైంది.

Employment in Telangana
సేవా రంగంలో ఉపాధి
author img

By

Published : Aug 8, 2021, 4:59 AM IST

Updated : Aug 8, 2021, 6:40 AM IST

రాష్ట్రంలో అత్యధికులు సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఆ రంగంలో ఉన్న స్థిరాస్తి, వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువ మందికి ఉపాధి చూపుతున్నాయి. తర్వాతి స్థానంలో వ్యవసాయ, అనుబంధ రంగాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిశ్రమల ద్వారా 10.6 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తెలంగాణ పరిశ్రమలశాఖ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్ర సమగ్ర ముఖచిత్రం రూపకల్పనలో భాగంగా పరిశ్రమల శాఖ వివిధ రంగాలపై జూన్‌లో సమగ్ర సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఉద్యోగిత తీరు (ఎంప్లాయ్‌మెంట్‌ ప్యాటర్న్‌)నూ విశ్లేషించింది. మొత్తంగా రాష్ట్ర జనాభాలో 50.2 శాతం మంది వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేస్తూ సుస్థిర ఉపాధి పొందుతున్నట్టు గణాంకాల ద్వారా తేల్చింది. మార్గదర్శకాల మేరకు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ (ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ) రంగాలుగా మొత్తం ఉద్యోగితను లెక్కించారు.

‘సేవ’లదే అగ్రస్థానం

సేవా రంగాన్ని తృతీయ విభాగంలో చేర్చారు. ఇందులో స్థిరాస్తి, రవాణా, వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, ఆహారం, సమాచారం(కమ్యూనికేషన్స్‌), వసతి, గోదాములు, మార్కెట్‌, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, సామాజిక సేవలు, పాలన, ఆర్థికం, బీమా తదితర విస్తృత శ్రేణి కార్యకలాపాలుండగా, మొత్తం ఉద్యోగితలో అది 65.2 శాతంతో ప్రథమస్థానంలో నిలిచింది.

  • ఆ తర్వాత స్థానంలో ప్రాథమిక రంగం 18.6 శాతంతో ఉంది. వ్యవసాయం, అటవీ, మత్స్య, పాడి, గనులు, చమురు, సహజవాయువు ఇతర సహజ వనరులు, ఆహారశుద్ధి ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి.
  • ద్వితీయ రంగం వాటా 16.2 శాతంగా ఉంది. ఇందులో ఉక్కు, రసాయనాలు, ప్లాస్టిక్‌, వాహనాలు సహా ఇతర తయారీ పరిశ్రమలు, ముడిచమురు, బొగ్గు, విద్యుత్‌, ఎరువులు, సిమెంటు, చేతి ఉత్పత్తులు, పత్తి ఆధారిత జౌళి, చెరకు, కుటీర పరిశ్రమలు ఉన్నాయి.

అయిదేళ్లలో మారిన చిత్రం

2015-16లో తెలంగాణలో ప్రాథమిక రంగం వాటా మొత్తం ఉద్యోగితలో 55.6 శాతంగా ఉండేది. తృతీయ(సేవా), ద్వితీయ రంగాల వాటా 26.6, 17.8 శాతంగా ఉంది. ఇప్పుడు సేవా రంగం వాటా ఏకంగా 65.2 శాతానికి ఎగబాకడం గమనార్హం.

ఇదీ చూడండి: CM KCR: సచివాలయ పనులను వేగవంతం చేయండి: కేసీఆర్​

Last Updated : Aug 8, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.