రక్షణ, భద్రత విషయంలో దేశంలోని హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో సికింద్రాబాద్లోని ఎస్వీఐటి కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసుశాఖ తరపున ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఉపాధిని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని గత నాలుగేళ్ల నుండి నిర్వహిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. 1800 మంది విద్యార్థులకు జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వారందరికి ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేళాలో పాల్గొన్న కంపెనీలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి :కశ్మీర్లో ఆంక్షలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థన