AP Employees Union on Protest: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ ఐకాస, అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లినట్లు ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. కానీ.. ఇప్పటి వరకూ ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే.. రేపటి నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్న ఆయన.. ప్రాంతీయ సదస్సులను జయప్రదం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: యువతిపై ఫ్యాక్టరీ మేనేజర్ కర్కశం- నొప్పితో ఏడుస్తున్నా..