ETV Bharat / state

Electrical Safety Tips During Rains : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. విద్యుత్​ ప్రమాదాలు జరగకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి - తెలంగాణలో భారీ వర్షాలు

Electrical Safety Tips During Rains : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్​ ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, విద్యుత్​ వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని.. దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమా రెడ్డి పలు సూచనలు చేశారు.

Avoid Electrical Accidents Precautions
Electrical Safety Tips During Rains in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 8:03 PM IST

Electrical Safety Tips During Rains in Telangana : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సాధారణ ప్రజలు, విద్యుత్​ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమా రెడ్డి పలు సూచనలు చేశారు. సీఎండీ రఘుమారెడ్డి సంస్థ పరిధిలోని చీఫ్​ జనరల్​ మేనేజర్​, సూపరింటెండింగ్​ ఇంజినీర్లతో ఆడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో విద్యుత్​ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

వర్షాలు పడేటప్పుడు అందరూ జాగ్రత్తగా(Electrical Precautions) ఉండాలని.. ముఖ్యంగా కరెంటు స్తంభాలు, విద్యుత్​ వైర్లు, ట్రాన్స్​ఫార్మర్​ లాంటి వాటి దగ్గర ఉండకూడదని దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమారెడ్డి కోరారు. ఇంకా పలు సూచనలను చేశారు. విద్యుత్​కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి(Emergency Number) ఉన్నా 1912 లేదా 100 నంబరుకు కాల్​ చేయాలని తెలిపారు. ఇంకా స్థానిక ఫ్యూజ్​ ఆఫ్​ కాల్​ ఆఫీస్​తో పాటు విద్యుత్​ శాఖ ప్రత్యేక కంట్రోల్​ రూం నంబర్లు 7382072104, 7382072106,7382071574 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Safety Precautions in Monsoon Telugu : భారీ వర్షాల వేళ బయటకెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు మరవకండి..?

How to Avoid Electrical Accidents Precautions : వీటితో వాటు సంస్థ మొబైల్​ యాప్​, వెబ్​సైట్​, ఎక్స్​(ట్విటర్​), ఫేస్​బుక్​ ద్వారా కూడా విద్యుత్​ సంబంధిత సమస్యలు విద్యుత్​ శాఖ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఇంకా విద్యుత్​ పరంగా తడి వస్తువులను చేతితో గానీ, కాలుతో గానీ తాకరాదని.. అసలు తడి వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు పిల్లలను కరెంటు వైర్లకు దగ్గరగా వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.

Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్​ తీసుకో.. ఈ ట్రాఫిక్​లో ఇళ్లు చేరేదెలా..?

Avoid Electrical Accidents Precautions
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా​ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షం పడేటప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా​ తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • వర్షాలు పడేటప్పుడు స్టే వైర్​ కింద, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలి.
  • పశువులను, పెంపుడు జంతువులను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.
  • రోడ్డు పైన, నీటిలోనూ విద్యుత్ తీగ పడి ఉన్నట్లయితే ఆ తీగను తొక్కడం గానీ, వాటి మీద నుంచి వాహనాలు నడపడం గానీ చేయరాదు.
  • ఒకవేళ ఎక్కడైనా విద్యుత్​ వైర్లు తెగిపడ్డట్లు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బంది లేదా హెల్ఫ్​లైన్​ నంబర్లకు సమాచారం అందించాలి.
  • చెట్ల కొమ్మలు, వాహనాలు, ఇతర భవనాలపై తెగి పడిన తీగలు ఉన్నట్లయితే వెంటనే సంస్థ దృష్టికి తీసుకురావాలి.
  • భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్​కి తెలియజేయాలి.
  • విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్​కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లుపై ముద్రితమైన యూఎస్​సీ(USC) నంబర్​ను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్​ సెల్లార్​లలో నీళ్లు చేరితే వెంటనే దగ్గరలోని విద్యుత్​ సిబ్బంది తెలపాలి.

విద్యుత్​ షాక్​కు బలైన మహిళ : బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఫిరోజ్​గూడ ప్రాంతంలో మాధవినగర్​కు చెందిన నిషాద్​ బేగం(21) అనే మహిళ ప్రమాదవశాత్తు ఇంట్లో కరెంట్​ షాక్​ తగిలి మృతి చెందింది. వర్షం కారణంగా ఇంట్లోకి నీరు రావడంతో గోడలకు కరెంట్​ షాక్​ రావడంతో.. అక్కడికక్కడే నిషాద్​ బేగం మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Students Stuck in Flood Water Video Viral : వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులు.. జేసీబీల సాయంతో బయటకు.. వీడియో వైరల్​

Pariki Cheruvu Nuraga Video in Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. చెరువులో నీటికి బదులు నురగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.