ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అధిక ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి సింహాసనంపై కొలువుదీర్చి విశేషంగా అలంకరించారు. పండితులు రెండు వర్గాలుగా ఏర్పడి స్వామి వారి గుణగణాలను కొంతమంది, అమ్మవార్ల గుణగణాలను మరికొంతమంది కీర్తించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పండితులు పెళ్లికి ఒప్పించి ఇరువురికి వివాహం చేయడానికి నిర్ణయించారు.
ఇదీ చదవండి : అలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవద్దు..!!