ETV Bharat / state

Telangana Assembly Elections 2023 : 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్​ కేంద్రం - తెలంగాణ ఓటర్ల సంఖ్య

EC on Telangana Assembly Elections 2023 : త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేసింది. ఓటర్లు పెరుగుతున్నందున.. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు ఉండేలా చూడాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.

EC Instructions for TS Assembly Elections

author img

By

Published : Jun 4, 2023, 10:49 AM IST

Telangana State Assembly Elections 2023 Voters List : ఈ సంవత్సరంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు కసరత్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్‌ కేంద్రం పరిధిలో గతంలో కన్నా ఓటర్ల సంఖ్య పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. హేతుబద్ధీకరణ ద్వారా.. ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లు అందరూ.. ఓటేసేందుకు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక నుంచి ఒక కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,500 మంది ఓటర్లు ఉండేలా చూడాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.

Telangana Voter List : గతంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో పట్టణాల్లో 1,200 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 1,400 మంది ఓటర్లు ఉండేవారు. అంతకు మించితే.. ఆ కేంద్రం పరిధిలో అనుబంధ స్టేషన్‌ ఏర్పాటు చేసేవారు. ఓటర్ల సంఖ్య పెరుగుతున్నందున కేంద్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతి ఎన్నికల సమయంలో సుమారు రెండు నుంచి మూడు వేల వరకు పోలింగ్‌ కేంద్రాలు పెరుగుతున్నాయి. కేంద్రాలను పక్కాగా జియోగ్రాఫికల్‌ మ్యాపింగ్‌ చేయాలని.. ఈసీ నిర్ణయించింది. ఆ మ్యాపింగ్‌ చేసే సమయంలో ఇంటి నంబర్లను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఒక ఇంట్లో ఉన్న ఓటర్లు.. ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండేలా చూడాలని ఈసీ సూచించింది.

తెలంగాణలో ఎన్నికలకు అవసరమయ్యే పోలింగ్‌ కేంద్రాలు : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మ్యాపింగ్‌ విధానం ముందుగా చేయాలని అధికారులకు సూచించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ చెప్పారు. ఈ జనవరి 5న ప్రకటించిన చివరి జాబితాలోని ఓటర్ల సంఖ్య ఆధారంగా 34,891 పోలింగ్‌ కేంద్రాలు రాష్ట్రంలో అవసరమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతరాయంగా సాగుతున్నందున ఓటర్ల సంఖ్య పెరగనుందని.. ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్య స్వల్పంగా పెరుగుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య వృద్ధి : ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం పంపిన 49,310 కంట్రోల్‌ యూనిట్లు, 63,120 బ్యాలెట్‌ యూనిట్లు, 53,255 వీవీప్యాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు 2,81,66,266 ఓటర్లు ఉన్నారు. 2018కు ఆ సంఖ్య 2,80,66,331 చేరింది. ప్రస్తుతం 2023 జనవరి నాటికి రాష్ట్రంలో 2,99,77,659 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఈ సంఖ్య ఎన్నికలు జరిగే సమయానికి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్‌ నెలకు 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కుకు అప్లై చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.