ETV Bharat / state

ఆమె ఓ ధీర వనిత - భాషా సాంస్కృతిక శాఖ,

హైదరాబాద్ సంస్థానంలో సామాజిక, సేవారంగంలో గణనీయమైన కృషి జరిపిన వారిలో ఒకరు ఈశ్వరీబాయి. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషిచేశారు.

ఈశ్వరీ బాయి వర్థంతి సభ
author img

By

Published : Feb 25, 2019, 5:24 AM IST

Updated : Feb 25, 2019, 8:35 AM IST

ఈశ్వరీ బాయి వర్థంతి సభ
కార్మిక, దళిత, స్త్రీ శ్రేయస్సు కోసం విశేష కృషి చేసిన ఈశ్వరీబాయి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవరసం ఉందని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమొరియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి సభను నిర్వహించారు. ఆమె ఒక సాహస వనిత, ఆదర్శనాయకురాలు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారురమణాచారి, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఈశ్వరీ బాయి కూతురు మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్యురాలుగా పేద ప్రజలకు సేవ చేయలన్నదే అమ్మ ఆశయమని... అయితే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారని గీతారెడ్డి అన్నారు.

ఇవీ చదవండి:నేతల నివాళి

Intro:Tg_wgl_02_25_Kakathiya_university_enganeering_kalsahala_samasyalu_pkg_c5

Body:వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పర్మినెంట్ అధ్యాపకులు, సరిపడా తరగతి గదులు,ల్యాబ్ సౌకర్యాలు, వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థుల చదువు ముందుకు వెళ్లడం లేదు. ఫలితంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తరగతి గదులను బహిష్కరించి గత నాలుగు రోజులుగా ఆందోళన బాట పట్టారు.....Look
V.O.1: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. సరైన అధ్యాపకులు లేక, ల్యాబ్ సౌకర్యం, కళాశాలలో మౌళిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ, ఈసీఈ,ఐటీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సీఎస్సీ పలు బ్రాంచి లో 1400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇంజనీరింగ్ కళాశాలలో 4 గురు పర్మినెంట్ అధ్యాపకులు, 40 మంది కాంట్రాక్టు అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. అందులో కొందరికి విద్యాబోధన చేయడం రావడం లేదని పాఠ్యాంశాలు సరిగ్గా అర్ధం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. గ్రంధాలయంలో ఇంజనీరింగ్ కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు సరిపడ లేకపోవడం, ల్యాబ్ సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ల్యాబ్ కోసం నిర్మిస్తున్న షెడ్లు ఇంకా అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి ఫలితంగా విద్యార్థులు పక్క కాలేజీకి వెళ్లి ల్యాబులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.....బైట్స్
ఇంజనీరింగ్ విద్యార్థులు.
V.O.2: ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు తరగతి గదులను బహిష్కరించి ఆందోళనకు దిగారు అరకొర వసతుల మధ్య నాణ్యమైన విద్య అందక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. పలుసార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు లేక....కాంట్రాక్ట్ అధ్యాపకులు చెప్పిన పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు తెలిపారు. పేరుకే కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలని....సమస్యలు అనేకమని అన్నారు .తక్షణమే ప్రభుత్వం కాకతీయ ఇంజనీరింగ్ కళాశాలకు అన్ని విభాగాల కు రెగ్యులర్ అధ్యపకులను నియమించి సరిపడ ప్రయోగ శాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ వసతి, భోజన సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలను విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు..... బైట్స్
విద్యార్థులు
END: వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల సమస్యలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కే టీ ఆర్ కు ట్వీట్ చేశారు. స్పందించిన కే టీఆర్ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి దృష్టి కి తీసుకవెళ్లినట్టు తెలిసింది.

Conclusion:engineering kalashala samasyalu.
Last Updated : Feb 25, 2019, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.