ETV Bharat / state

Engineering Seat: ఇంజినీరింగ్‌ సీట్లు ఎంచుకునేదెలా? - Telangana Eamcet web options

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల గడువు ముంచుకొస్తోంది. జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల గుర్తింపు(అఫిలియేషన్‌) ప్రక్రియ పూర్తి కాకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనెల 3 రాత్రిలోగా పూర్తి కాకపోతే సీట్లు ఎంచుకునేందుకు వీలుండదు.

Eamcet web options
ఇంజినీరింగ్‌
author img

By

Published : Sep 2, 2021, 9:14 AM IST

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల గడువు ముంచుకొస్తున్న వేళ.. జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలల గుర్తింపు(అఫిలియేషన్‌) ప్రక్రియ పూర్తి కాకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈనెల 3 రాత్రిలోగా పూర్తి కాకపోతే సీట్లు ఎంచుకునేందుకు వీలుండదు. జేఎన్‌టీయూ పరిధిలో 148 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ఏటా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ కంటే ముందుగా ఆయా కళాశాలల తనిఖీలు పూర్తిచేసి గుర్తింపునివ్వాలి. ఆ జాబితాను ఉన్నత విద్యామండలికి సమర్పిస్తే.. ఎంసెట్‌ ర్యాంకులు దక్కించుకున్న విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు వీలవుతుంది. కరోనా ఉద్ధృతి కారణంగా గతేడాది తనిఖీలు లేకుండానే జేఎన్‌టీయూ గుర్తింపునిచ్చింది.

తనిఖీలు పూర్తి.. నివేదికల పరిశీలన...

ఈ ఏడాది తనిఖీలు పూర్తి చేశాకే గుర్తింపునివ్వాలని ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి అనూహ్యంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. హుటాహుటిన జేఎన్‌టీయూ స్పందించి గత నెల 23 నుంచి కళాశాలల తనిఖీ చేపట్టి 30వ తేదీకి పూర్తి చేసింది. ప్రస్తుతం నివేదికలు పరిశీలించి గుర్తింపు ఇచ్చే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు 7 నుంచి 10 రోజులు పట్టొచ్చు.

ఈనెల 4 నుంచి 13వ తేదీ మధ్య వెబ్‌ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండటంతో, నిర్దేశిత గడువులోగా ఎన్ని కళాశాలలకు గుర్తింపు ఇవ్వగలిగితే.. వాటిన్నింటిని పూర్తిచేసి జాబితాను ఉన్నత విద్యామండలికి పంపించాలని భావిస్తున్నట్లు జేఎన్‌టీయూ అధికారి ఒకరు తెలిపారు. తర్వాత మిగిలిన కళాశాలల వివరాలు సమర్పిస్తామన్నారు. మరోవైపు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను వారం రోజులు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నత విద్యా మండలిని కోరినట్లు తెలిసింది.

జేఎన్‌టీయూనే కీలకం...

జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో దాదాపు 89 వేల ఇంజినీరింగ్‌ సీట్లున్నాయి. కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తికాకపోతే వెబ్‌ఆప్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనికితోడు 2021-22 నుంచి బీటెక్‌లో నాలుగు కొత్త కోర్సులకు అనుమతించింది. గుర్తింపు రాకపోతే ఆయా కోర్సులు ప్రారంభించడం కష్టతరమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: BANDI SANJAY PADAYATRA: ఈటల రాజేందర్​ గెలుపు ఖాయం: బండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.