ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ నేటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష 56 వేల 812 మంది ఇంజినీరింగ్ ఎంసెట్ రాశారు. ఈనెల 18 నుంచి ఇవాళ్టి వరకు రోజుకు రెండు పూటల చొప్పున పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష 72 వేల 273 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ... 9శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు.
వర్షాలు, వరదల వల్ల ఈనెల 14, 15న జరగాల్సిన అగ్రికల్చర్ ఎంసెట్ ను... ఈనెల 30, 31కి వాయిదా వేశారు. ఆ పరీక్షలు ముగిసిన తర్వాత రెండింటి ఫలితాలను ఒకేసారి వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ తర్వాతే ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.