ఖమ్మంలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుణ్ని వెంటనే శిక్షించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. తన ఇంట్లో పని చేస్తున్న బాలికపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా.. ఎవరికైనా చెబుతుందేమోనని అత్యంత దారుణంగా.. కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించిన మారయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ చిలకలగూడలో ఆందోళనకు దిగారు.
ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలికకు ప్రభుత్వమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వం చలనం లేకుండా ఉండటం బాధాకరమని వాపోయారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు కోరారు.
- ఇదీ చదవండి అమానుషం బాలికపై పైశాచికం.. హత్యాచారయత్నం