ETV Bharat / state

గోదావరిలో పావువంతు నీరు కూడా వాడలేదు - godavari krishna water news

ముగిసిన నీటి సంవత్సరంలో వినియోగం పోగా 4,760 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి చేరింది. ఇది పదేళ్ల సరాసరి కంటే గత నీటి సంవత్సరంలో అధికమని లెక్కలు చెబుతున్నాయి. వివిధ ప్రాజెక్టుల కింద వినియోగం పోనూ 3,482 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఇందులో నాలుగోవంతు కూడా గోదావరిలోని అన్ని ప్రాజెక్టుల కింద వినియోగం జరగలేదు.

During the last water year, 4,760 TMC of water reached the sea after consumption
గోదావరిలో పావువంతు నీరు వాడలేదు
author img

By

Published : Jun 16, 2021, 7:10 AM IST

ముగిసిన నీటి సంవత్సరంలో కృష్ణా, గోదావరి నదుల నుంచి నీరు భారీగా సముద్రంలోకి వెళ్లింది. గత పదేళ్ల సరాసరి కంటే 2020-21వ నీటి సంవత్సరంలో గోదావరిలో ఎక్కువ నీటి లభ్యత ఉండగా, ఇందులో ఎక్కువ భాగం సముద్రంలోకి వెళ్లింది. గోదావరిలో 2020 జూన్‌ 1 నుంచి 2021 మే నెల ఆఖరు వరకు దిగువన ఉన్న పోలవరం వద్ద 3,917 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కేంద్ర జలసంఘం తేల్చింది. అంతకు ముందు పది సంవత్సరాల్లో ఇక్కడ సరాసరి నీటి లభ్యత 3,020 టీఎంసీలు మాత్రమే. గోదావరిలో అత్యధికంగా నీటి లభ్యత ఉన్న సంవత్సరాల్లో తాజాగా ముగిసింది కూడా ఒకటి. వివిధ ప్రాజెక్టుల కింద వినియోగం పోనూ 3482 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. ఇందులో నాలుగోవంతు కూడా గోదావరిలోని అన్ని ప్రాజెక్టుల కింద వినియోగం జరగలేదు. గోదావరి, కృష్ణానదిలో కలిసి గత నీటి సంవత్సరంలో 4760 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది.

ఇంద్రావతిలో ఎక్కువ..

పదేళ్ల సరాసరిని పరిగణనలోకి తీసుకొంటే గత నీటి సంవత్సరంలో ప్రాణహితలో లభ్యత తగ్గగా, ఇంద్రావతిలో పెరిగింది. ప్రాణహిత నదిలో పదేళ్ల సరాసరి 1264.72 టీఎంసీలు కాగా, గత ఏడాది 1056 టీఎంసీలు. ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇక్కడి నుంచి రోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం జరిగింది. దీనికి దిగువన ఇంద్రావతి గోదావరిలో కలుస్తుంది. ఇంద్రావతిలో సరాసరి లభ్యత 857 టీఎంసీలు కాగా, గత ఏడాది 983 టీఎంసీలు. దీనికి దిగువన గోదావరిలో కలిసే శబరిలో కూడా సరాసరి లభ్యత 625 టీఎంసీలు కాగా, గత సంవత్సరం 768 టీఎంసీల లభ్యత ఉంది. ఇంద్రావతి, శబరి మధ్యలో దేవాదుల, తుపాకులగూడెం, దుమ్ముగూడెం, సీతారామ ఎత్తిపోతల ఉన్నాయి. శబరి గోదావరిలో కలిసిన తర్వాత నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు, దిగువన ధవళేశ్వరం ఉన్నాయి. మొత్తమ్మీద పోలవరం వద్ద పదేళ్ల సరాసరి లభ్యత 3020 టీఎంసీలు కాగా, గత ఏడాది 3917 టీఎంసీలు ఉంది. ఇందులో ధవళేశ్వరం, తాడిపూడి, పుష్కరం, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మళ్లించిన నీరు మినహా మిగిలిందంతా సముద్రంలోకి వెళ్లింది. కేంద్ర జలసంఘం వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 1966 నుంచి ఇప్పటివరకు అతి తక్కువ 1500 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, అతి ఎక్కువగా ఆరువేల టీఎంసీలు ఉంది.

కృష్ణాలో 1278 టీఎంసీలు

కృష్ణా బేసిన్‌లో కూడా గత నీటి సంవత్సరం అధిక మొత్తంలో సముద్రానికి వెళ్లింది. ప్రధాన కృష్ణాపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, ప్రకాశం బ్యారేజీ కింద పూర్తిస్థాయిలో నీటి వినియోగంతోపాటు, ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకొనే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎ.ఎం.ఆర్‌.పి ఇలా అన్ని ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌, రబీలో వినియోగంపోనూ 1278 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది.

ఇదీ చూడండి: 'వైరస్‌ సోకినా... వ్యాక్సిన్‌తో ప్రాణాపాయం తప్పుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.