హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మోతీ నగర్లో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనం లో అపశ్రుతి చోటుచేసుకుంది. కొందరు యువకులు పీకల దాకా మద్యం సేవించి రోడ్డుపై హల్చల్ చేశారు. అనంతరం సదర్‌లో పాల్గొన్న కొందరు యువకులను చితకబాదారు. ఈ విషయంపై బాధితులు ఘటన స్థలంలోని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా... ఈ ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదంటు సనత్ నగర్, ఎస్.ఆర్.నగర్ పోలీసులు తప్పించుకున్నారు. ఏం చేయాలో పాలుపోని బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఘటన జరిగినప్పటికీ... పోలీసులు రాకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: నేటి నుంచి దిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం