కష్టకాలంలో ఉన్న వారికి తన వంతు సాయంగా ఆహారం అందించి ఆకలి తీర్చుతోంది లంగర్ హౌస్కు చెందిన సునంద. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీటిలో చిక్కుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్లలోకి నీరు చేరి... విద్యుత్ సరఫరా నిలిపోయి తిండి లేక నానా అవస్థలు పడుతున్న వారి ఆకలి బాధను తీర్చుతోంది. ఆమెలా మరింత మంది ముందుకొచ్చి ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: టోలీచౌకి నదీమ్ కాలనీలో మంత్రి కేటీఆర్ పర్యటన