ETV Bharat / state

సిబ్బంది అపార్థం చేసుకోవద్దు.. లోపాలను సరిదిద్దాలనే.. : హైకోర్టు - హైకోర్టులో విచారణ

కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రీపగలు కష్ట పడుతున్నారని సీఎస్ సోమేశ్ కుమార్ హైకోర్టుకు వెల్లడించారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా యాంటిజెన్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.

మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు..  సిబ్బంది రాత్రీ పగలు కష్టపడుతున్నారు : హైకోర్టు

author img

By

Published : Aug 13, 2020, 1:23 PM IST

కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రీపగలు కష్ట పడుతున్నారని సీఎస్ వెల్లడించారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా యాంటిజెన్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 40వేల ర్యాపిడ్ పరీక్షలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జీహెచ్‌ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పించామని సీఎస్ చెప్పుకొచ్చారు. హితం యాప్‌ను ఇప్పటివరకు 46 వేల మంది వినియోగించారని కోర్టుకు తెలిపారు.

తెలుగులోనూ ఇచ్చాం...

హైకోర్టు సూచనల మేరకు తెలుగులో కూడా బులెటిన్ ఇచ్చామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరుపుతున్నామని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కేర్ కేంద్రాల వివరాలు వెల్లడిస్తామన్నారు.

అపార్థం చేసుకోవద్దు...

కరోనా యోధులు మా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని హైకోర్టు కోరింది. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని విమర్శించాలనేది మా ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్టపడుతోందని కితాబిచ్చింది. చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేదే మా ప్రయత్నమని సూచించింది. దేశంలోనే రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని మా ప్రయత్నమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందని ప్రశంసించింది. సుమారు 99 శాతం పర్‌ఫెక్షన్ వచ్చిందని హైకోర్టు వ్యాఖ్యనించింది.

ఇవీ చూడండి : వచ్చే వారం నుంచి సుప్రీంలో భౌతిక విచారణ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.