ETV Bharat / state

పీఆర్​సీఐకి ఎంపికైన ఐదు డాక్యుమెంటరీలు.. కేసీఆర్​, కేటీఆర్​ హర్షం - telangana government

PRCI National Annual Awards: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై డీఎన్​ఎస్​ ఫిల్మ్స్‌ రూపొందించిన ఐదు డాక్యుమెంటరీలు.. పీఆర్​సీఐ జాతీయ వార్షిక పురస్కారాలలో ఎంపికయ్యాయి. వీటిని కోల్​కతాలో జరిగిన ప్రపంచ సమాచార శిఖరాగ్ర సదస్సులో డీఎన్​ఎస్ అధినేత సత్యనారాయణ అందుకున్నారు. అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు.

PRCI National Annual Awards
PRCI National Annual Awards
author img

By

Published : Nov 14, 2022, 9:47 AM IST

PRCI National Annual Awards: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై డీఎన్​ఎస్​ ఫిల్మ్స్‌ రూపొందించిన ఐదు డాక్యుమెంటరీలు.. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(PRCI) జాతీయ వార్షిక పురస్కారాలను గెల్చుకున్నాయి. ఈనెల 12న కోల్‌కతాలో జరిగిన ప్రపంచ సమాచార శిఖరాగ్ర సదస్సు-2022లో డీఎన్​ఎస్ అధినేత సత్యనారాయణ ఆ ఐదు అవార్డుల్ని అందుకున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌ మార్గ నిర్దేశంలో ఆ డాక్యుమెంటరీలను రూపొందించామని.. పురస్కారాలకు వారి ప్రోత్సాహమే కారణమని సత్యనారాయణ తెలిపారు.

కళలు, సంసృతి విభాగంలో బుద్ధవనంకు క్రిస్టల్‌ అవార్డు, విజనరీ లీడర్‌షిప్‌ క్యాంపెయిన్‌ ఆఫ్‌ది ఇయర్‌కి.. సీఎం కేసీఆర్‌ ప్రగతిశీల తెలంగాణ డాక్యుమెంటరీకి స్వర్ణం దక్కింది. పర్యాటక, ఆతిథ్య ప్రచారంలో భాగంగా చేసిన సోమశిల పర్యాటక సర్క్యూట్‌, ఆరోగ్య సంరక్షణ ప్రచార చిత్రానికి స్వర్ణాలు వచ్చాయి. రైతుబంధు - రైతుబీమాపై రూపొందించిన ప్రభుత్వ సమాచార చిత్రానికి కాంస్యం పురస్కారం వరించింది. రాష్ట్రంలోని అభివృద్ధి, పర్యాటక రంగంపై రూపొందించిన డాక్యుమెంటరీలకు పురస్కారాలు దక్కడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.