ETV Bharat / state

KCR KIT: నిరాటంకంగా కేసీఆర్‌ కిట్ల పంపిణీ.. ఇప్పటివరకు ఎంతమందికి అందిందంటే? - Distribution of KCR kits close to 11 lakhs

తెలంగాణలో ప్రవేశపెట్టిన 'కేసీఆర్‌ కిట్‌’ పథకం (kcr kit scheme) విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అందజేసిన కిట్లు 11 లక్షలకు(10,80,197) చేరువ కావడం విశేషం. ఈ మేరకు తాజాగా వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది.

Distribution of KCR kits close to 11 lakhs in telangana
KCR KIT
author img

By

Published : Nov 8, 2021, 8:47 AM IST

‘కేసీఆర్‌ కిట్‌’ పథకం (kcr kit scheme) గత నాలుగున్నరేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. 2017 జూన్‌ 3న ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అందజేసిన కిట్లు (kcr kit scheme)11 లక్షలకు(10,80,197) చేరువ కావడం విశేషం. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 2,01,245 కిట్లను (kcr kit scheme) అందజేయగా.. అతి తక్కువగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 7,072, ములుగు జిల్లాలో 8,549 కిట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు తాజాగా వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. పథకంలో భాగంగా ప్రసవ సమయంలో ఆసుపత్రిలో 16 రకాల వస్తువులతో కిట్‌ను అందిస్తున్నారు. అన్నీ ప్రముఖ ఉత్పత్తి సంస్థలకు చెందినవే కావడంతో వీటికి ఆదరణ ఎక్కువగా ఉంటోంది.

తల్లీబిడ్డలకు రక్షగా..

  • కేసీఆర్‌ కిట్‌ పథకం(kcr kit scheme) ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణలోని సర్కారు దవాఖానాలు కాన్పులతో కళకళలాడుతున్నాయి. 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉండగా.. తాజాగా ఇది 55 శాతానికిపైగా నమోదైంది.
  • ఈ పథకం కింద తల్లీబిడ్డల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో మాతాశిశు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. 2014లో ప్రతి వెయ్యి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా.. తాజా గణాంకాల్లో ఆ సంఖ్య 23కి తగ్గింది.
  • బాలింత మరణాల రేటు 2014-16లో ప్రతి లక్ష ప్రసవాలకు 81 ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 63కి చేరింది.

నగదు ప్రోత్సాహకం..

కేసీఆర్‌ కిట్‌ (kcr kit scheme) విజయవంతం వెనుక నగదు ప్రోత్సాహక పథకం పాత్ర ప్రముఖంగా ఉంది. గర్భిణి దశ నుంచి శిశువుకు తొమ్మిదో నెల వచ్చే వరకూ నాలుగు విడతలుగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తుండటంతో అనూహ్య స్పందన లభిస్తోంది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు.. బాబు జన్మిస్తే రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధుల పంపిణీలో కొంత జాప్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, 3,4 నెలలు ఆలస్యంగానైనా పక్కాగా తల్లి ఖాతాలో జమచేస్తున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.

...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.