రేపు నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో పెంటాని చెరువులో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ చేప పిల్లలను విడుదల చేసి... ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సంఘాల నేతలు, మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.00 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో మద్దికాని చెరువులో మంత్రులు చేతుల మీదుగా చేప పిల్లలు విడుదల చేస్తారు.
11.30 గంటలకు కోడూర్ గ్రామంలో మైసమ్మ చెరువులో చేప పిల్లలు విడుదల చేస్తారు. 1.45 గంటలకు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కమ్మదానం గ్రామంలోని వెంకాయకుంట చెరువులో... మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి తలసాని చేప పిల్లలను వదలనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో చేప పిల్లల పంపిణీ సందర్భంగా భౌతిక దూరం పాటిస్తూ... హాజరైన ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన దృష్ట్యా... ఆ ఏర్పాట్లు చేసినట్లు మత్స్య శాఖ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?