ETV Bharat / state

Corona: కరోనా బాధితులకు ఇళ్ల వద్దే మందుల పంపిణీ - distribution of corona medicines to covid victims

రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దశల వారీగా ఆంక్షలతో కూడిన లాక్​డౌన్​ను అమలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇంటింటి ఫీవర్​ సర్వే చేపడుతూ మహమ్మారిని ఆదిలోనే అంతం చేసేలా కృషి చేస్తోంది. కరోనా లక్షణాలున్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి కిట్ల రూపంలో మందులు పంపిణీ చేస్తోంది.

corona medicines to victims at home
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/11-June-2021/12091088_corona.jpg
author img

By

Published : Jun 11, 2021, 7:32 AM IST

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వైరస్‌ లక్షణాలున్న వారికి ఇళ్ల వద్దే మందులు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం 8 రకాల ఔషధాలను కిట్ల రూపంలో తయారుచేస్తోంది. హైదరాబాద్‌ నారాయణగూడలోని బీసీ భవన్‌లో వైద్యారోగ్య సిబ్బంది కిట్లను తయారు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: Vaccination: కొవిడ్‌ తగ్గిన వారికి ఒక్క డోసు చాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.