ETV Bharat / state

హక్కుల కోసం కుటుంబాల్లో పేచీలు.. హత్యలకు దారితీస్తున్న గట్టు తగాదాలు - Agriculture disputes

నేటి వాణిజ్య ప్రపంచంలో భూమి అంటే ఉత్పాదక సాధనం కాదు.. వ్యాపార వస్తువు! పొలం అంటే దుక్కిదున్నితే పంట పండేది కాదు.. దున్నకుండానే కాసులు కురిపించేది!! అందుకే పొలాలు పగలు రేకెత్తిస్తున్నాయి.. ఆస్తుల విలువ మానవీయ విలువల్ని తెంచేస్తున్నాయి. కలిసి పెరిగిన అన్నదమ్ములే హత్యలదాకా వెళుతున్నారు. గ్రామాల్లో భూవివాదాలు.. వాటి తాలూకూ నేరాలు పెరిగిపోతున్నాయి.

Disputes
గట్టు తగాదాలు
author img

By

Published : Oct 2, 2021, 5:24 AM IST

* నల్గొండ పట్టణానికి చెందిన రామస్వామి, కాశయ్య అనే అన్నదమ్ముల్ని గట్టు తగాదా మట్టుపెట్టింది. ఇద్దరి పొలానికి మధ్య గట్టు విషయంలో కాశయ్య కుమారులు మల్లేశ్‌, మహేశ్‌ దారికాచి తన పెదనాన్న రామస్వామిని హత్య చేశారు. అదే రోజు సాయంత్రం రామస్వామి కుమారుడు కిరణ్‌ తన బాబాయి కాశయ్యను హతమార్చాడు.

* తాజాగా బుధవారం అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం బ్రాహ్మణపల్లిలో పెద్దకుమారుడికి కాస్త ఎక్కువ భూమి పంచుతానని చెప్పిన పాపానికి మిగిలిన ఇద్దరు కుమారులు కన్నతండ్రి పాపయ్య(60)ను హతమార్చడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకూ ఎకరం రూ. 2 లక్షలున్న భూమి ఇప్పుడు రూ. 25 లక్షల వరకు పలుకుతోంది. ఇది రక్తసంబంధీకుల మధ్యే ఆశ పుట్టిస్తోంది.. ఆస్తి పంపకాల్లో ముసలం మొదలవుతోంది.. కుటుంబ వివాదాలు కాస్తా పంచాయితీలవుతున్నాయి. ఒక్కోసారి హత్యలకూ దారితీస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో భూసంబంధ నేరాలు పెరుగుతున్నాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిలో ఈ విషయం వెల్లడైంది. అన్ని వివాదాలూ హత్యల వరకూ వెళ్లకపోయినా వాటాల పేరుతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న కేసులూ భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

హత్యలు

ముఖ్యంగా గ్రామాల్లో ఆస్తి కోసం ఘర్షణ పడుతున్న కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో భూవివాదాల కారణంగా 93 హత్యలు జరిగాయి. అంతకు ముందు ఏడాది అంటే 2019లో 73, 2018లో 69 హత్యలు జరిగాయి. వాస్తవానికి 2019 కంటే 2020లో హత్య కేసులు (అన్నీ కలిపి) 37 తక్కువగా నమోదయ్యాయి. ఇదే సమయంలో భూవివాదాల కారణంగా జరిగిన హత్యలు 20 వరకు పెరిగాయి.

ధరల పెరుగుదలే కారణం...

రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతుండటమే వివాదాలకు మూలంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇళ్లు, ప్లాట్ల వంటి స్థిరాస్తి వ్యాపారానికి మాత్రమే పరిమితమైన లావాదేవీలు ఇప్పుడు వ్యవసాయ భూములకూ విస్తరించాయి. ఇలా కొనడం, అలా అమ్మడం లేదా ఇక్కడ అమ్మి అక్కడ కొనడం వంటివి పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చి మారుమూల గ్రామాల్లో కూడా కొందరు భూములు కొంటున్నారు. ఇలా ధరలు పెరిగిన క్రమంలో వివాదాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. గతంలో ఇలాంటి వివాదాలు వ్యాపార సంబంధమైనవే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సొంత కుటుంబీకులే వాటాల కోసం రోడ్డెక్కుతున్నారు.

కుటుంబాల్లో కల్లోలం...

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మంజునాయక్‌,. మహంకాళీ నాయక్‌ మధ్య వారసత్వ ఆస్తిపై వివాదం మొదలైంది. 20 ఎకరాల భూమి తాను సొంతగా కొనుక్కున్నానని, ఇది వారసత్వ ఆస్తికాదని అందులో వాటా ఇవ్వడం సాధ్యంకాదని మంజునాయక్‌ తన సోదరుడు మహంకాళికి చెప్పాడు. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. దాంతో జూన్‌ 20న మంజునాయక్‌(70) తన ఇద్దరు కుమారులు సారయ్య (45), భాస్కర్‌ (35)లతో కలిసి పొలంలో ఉండగా మహంకాళీ అనుచరులతో వచ్చి ఆ ముగ్గురినీ నరికి చంపాడు. సీతారామ ఎత్తిపోతల కారణంగా భద్రాద్రి జిల్లాలో భూముల ధరలు పెరిగాయి. రెండేళ్ల క్రితం వరకూ ఎకరం రూ.2 లక్షలున్న భూమి ఇప్పుడు రూ.25 లక్షలకు చేరింది. గ్రామాలకు చెందిన అనేకమంది సొంత కుటుంబీకులే వాటాల కోసం కేసులు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా గ్రామాల్లో ఇలాంటి వివాదాలు మామూలయ్యాయి.

* నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన అన్నదమ్ములు లక్ష్మయ్య, శ్రీనుల మధ్య వారసత్వంగా వచ్చిన ఆరు గుంటల స్థలం విషయంలో వివాదం ఉంది. జూన్‌ 28న ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలైంది. ఆగ్రహానికి గురైన అన్న లక్ష్మయ్య బరిసెతో తమ్ముడు శ్రీనును, అడ్డం వచ్చిన తల్లి మారెమ్మను పొడవడంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.

చట్టాలను వక్రీకరిస్తున్నారు..

వ్యవసాయ భూములు క్రమంగా వ్యాపార (స్థిరాస్తి) భూములుగా మారుతుండటంతో విలువ అమాంతం పెరిగిపోతోంది. దాంతో వారసుల మధ్య ఆశ పుడుతోంది.. దీనిని కొందరు వ్యాపారులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. భూపరిపాలన చట్టాలకు వక్రభాష్యం చెబుతూ వివాదాలు రేకెత్తిస్తున్నారు. పరిపాలనపరంగా కొన్ని మార్పులు తేవడం వల్ల ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. భూ విషయాలపై ఇప్పుడు జిల్లా కలెక్టర్‌కే హక్కు ఉంది. ప్రస్తుతం వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులను లేదా ట్రైబ్యునల్స్‌ను నియమించాలి. తద్వారా సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. భూ బదిలీ చట్టంలో కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలి. తద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చు.

- వై.రామారావు, న్యాయవాది

ఇదీచూడండి: Huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.