Digital Health Cards in Telangana : రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని అని అన్నారు. అయితే నాణ్యమైన వైద్యసేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నదని రేవంత్‌రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy Davos Tour : ప్రజలందరికీ ఉత్తమ వైద్యసేవలు అందించాలనేదే తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిచనున్నట్లు చెప్పారు. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యం. మెరుగైన వైద్యసేవలు, సాఫ్ట్‌వేర్ రంగాలకు కేంద్రంగా హైదరాబాద్. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. ప్రతి పేదవాడు రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో చికిత్స పొందవచ్చు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్ ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - దావోస్ వేదికగా రూ. 37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు