హైదరాబాద్‌లో కుండపోత వర్షాలతో వరదల్లో చిక్కుకుపోయిన బాధితులకు అండగా ఉంటానంటూ ధనలక్ష్మి ట్రస్ట్ ఛైర్మన్ గుడ్ల ధనలక్ష్మి ముందుకు వచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని పలుకాలనీల్లో ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించారు. వారికి నిత్యావసర సరకులు, దుస్తులు పంపిణీ చేశారు.
కైలాస నగర్, వేముకుంట, శివాజీనగర్ కాలనీలతో పాటు పలు కాలనీల్లో నివసించే ప్రజలు.. ట్రస్ట్ ఛైర్మన్‌తో తమ గోడును విన్నవించుకున్నారు. నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ తమని పట్టించుకోలేదని వాపోయారు.
ఆర్థిక సాయం అందేలా చేస్తా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని డివిజన్ వాసులకు ధనలక్ష్మి హామీ ఇచ్చారు. నిత్యావసర సరకులు పంపిణీ చేసి తమను ఆదుకున్నందుకు వరద బాధితులు ఆమెకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: ఆత్మ గౌరవానికి, అహంభావానికి మధ్య పోటీ: కోదండరాం