ETV Bharat / state

లాక్​డౌన్ కోసం త్రిముఖ వ్యూహం: డీజీపీ మహేందర్ రెడ్డి - dgp special plan to lockdown

కరోనా నివారణ కోసం విధించిన లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు.

లాక్​డౌన్ కోసం త్రిముఖ వ్యూహం: డీజీపీ మహేందర్ రెడ్డి

author img

By

Published : Apr 10, 2020, 12:52 PM IST

లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ట్విటర్​లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రాంతాలను గుర్తిస్తున్నామని... జనం రద్దీకి, వాహనాలు రహదారుల పైకి రావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని డీజీపీ తెలిపారు.

పట్టణాలు, జిల్లా కేంద్రాలు, నగరాల వారీగా ఉల్లంఘన కేసుల సంఖ్య, సీసీటీవీలను పరిశీలిస్తున్నామన్న డీజీపీ.. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. లాక్​డౌన్ సందర్భంగా పోలీసులు విధుల్లో నిమగ్నమై ఉన్నారని... వారి కుటుంబ సభ్యుల కోసం టెలీ హెల్త్ కన్సల్టేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. నిపుణులైన వైద్యులు ఫోన్​లోనే ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: కానిస్టేబుళ్లలో మనోధైర్యం నింపడానికి సీపీ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.