GOLD CROWNS TO BEZAWADA KANAKADURGA : ఏపీ విజయవాడ కనకదుర్గ అమ్మవారికి నవీ ముంబై రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి 3 బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహా అలంకరణ కోసం సుమారు 1308 గ్రాముల బరువు గల కిరీటాలను ఆలయ ఈవోకు అందజేశారు. దాత కుటుంబానికి దర్శనాంతరం.. ప్రధాన అర్చకులతో వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో.. దాతకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.
ఇవీ చదవండి: