ETV Bharat / state

'ఏడేళ్లైనా ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం' - high court said to telugu states

తెలుగు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యంపై.. రెండు బోర్డుల అధికారులు వెంటనే చర్చించాలని సూచించింది. రెండు నెలల్లో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించింది.

telangana high court news, ts high court latest news
'ఏడేళ్లైనా ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం'
author img

By

Published : Apr 15, 2021, 5:03 AM IST

రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల విభజన చేపట్టకపోవడంపై రెండు రాష్ట్రాల బోర్డుల తీరును హైకోర్టు తప్పు బట్టింది. రెండు బోర్డుల అధికారులు కూర్చుని పరస్పరం చర్చించుకుని ఇద్దరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా... రెండు నెలల్లో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించాలంటూ రెండు బోర్డులను ఆదేశించింది.

సీనియారిటీ జాబితా

రాష్ట్ర విభజన సమయంలో ఉన్న ఉద్యోగుల ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డుకు సూచించింది. రెండు బోర్డులు మార్గదర్శకాలు రూపొందించిన నెలలోగా ఆ సీనియారిటీ జాబితా ఆధారంగా కేటాయింపులు చేపట్టాలంటూ తీర్పు వెలువరించింది. ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడాన్ని సవాలు చేస్తూ.. ఎస్.సావిత్రితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్​లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను విని ఇటీవల తీర్పు వెలువరించింది.

ప్రొసిడింగ్స్ జారీ

రాష్ట్ర విభజన అనంతరం 2014 డిసెంబర్ 4న తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ బోర్డును ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 24న కొంతమంది ఉద్యోగులను బోర్డులోకి తీసుకుంటూ ప్రొసిడింగ్స్ జారీ చేసింది. తెలంగాణకు చెందిన పిటిషనర్లను ఏపీ బోర్డులోనే ఉంచింది. విభజనకు ముందే సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందినప్పటికీ.. తెలంగాణ బోర్డు 2016లో రూపొందించిన సీనియారిటీ జాబితాలో జూనియర్లకు అవకాశం కల్పించి తమ పేర్లను మినహాయించాలని పిటిషనర్లు పేర్కొన్నారు.

వినతి పత్రాలపై స్పందించలేదు

తెలంగాణకు చెందినవారిమని తమ కేసును పరిశీలించాలని వినతి పత్రాలు పెట్టినా స్పందించలేదన్నారు. పదో షెడ్యూలులో ఉన్న సంస్థల విభజనకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని తెలంగాణ బోర్డు కౌంటరులో పేర్కొంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొందరు తెలంగాణ బోర్డులో ఏపీకీ చెందినవారు పనిచేస్తున్నారని ఏపీ ఇంటర్ బోర్డు కౌంటర్​లో తెలిపింది. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం రాష్ట్ర పునర్​వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం కార్పొరేట్ సంస్థలు సొంతంగా మార్గదర్శకాలు రూపొదించుకొవచ్చంది. 9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల ఆస్తి, అప్పుల పంపకాలు జరుగకపోయినప్పటికీ.. ఉద్యోగుల విభజన అడ్డంకి కాదని చెప్పింది.

ఆశ్రయించవచ్చు

2014 జూన్ 2 నాటి ఉద్యోగుల ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఏపీ బోర్డును ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందినప్పటి నుంచి రెండు నెలల్లోగా రెండు బోర్డులు పరస్పరం చర్చించి ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది. అనంతరం నెలలోగా సీనియారిటీ జాబితా మార్గదర్శకాలకు అనుగుణంగా విభజన జరగాలని తీర్పులో పేర్కొంది. పిటిషనర్లకు చెందిన ఇతర అభ్యంతరాలపై తుది కేటాయింపులు జరిగాక కోర్టును ఆశ్రయించవచ్చని వెలువరించింది.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 8 వారాల్లో 25 రెట్లు పెరిగిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.