ETV Bharat / state

డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

DCCB election Notification release
DCCB election Notification release
author img

By

Published : Feb 20, 2020, 6:50 PM IST

Updated : Feb 20, 2020, 7:54 PM IST

15:49 February 20

డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

                జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న జిల్లా సహకార ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంట వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈనెల 28న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి... ఫలితాలు వెల్లడిస్తారు.  

         ఫిబ్రవరి 29న డీసీసీబీ బేరర్స్ ఎన్నిక జరుగుతుందని సహకార శాఖ ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి. 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులపై  పూర్తి ఆధిక్యత కనబరిచిన దృష్ట్యా... తెరాస అభ్యర్థులే అధ్యక్షులుగా ఎన్నికయ్యే అవకాశలు ఉన్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున ఆశావహులు డీసీసీబీ ఛైర్మన్‌గిరీ కోసం మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేల ద్వారా తమవంతు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్​

Last Updated : Feb 20, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.