తెలంగాణ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా డాక్టర్ దాసోజు శ్రవణ్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించింది. 2014లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన పోటీ చేశారు. ఇప్పటికే దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా డాక్టర్ గీతారెడ్డి పనిచేస్తుండగా.. తాజాగా దాసోజు శ్రవణ్‌ను తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌గా నియమించారు.
దాసోజు శ్రవణ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి సంతోష్‌కుమార్ రుద్రను ప్రొఫెషనల్ ఉపాధ్యక్షులుగా, హైదరాబాద్‌కు చెందిన మన్నే సతీష్ కుమార్‌ను సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియామిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవీ చూడండి: హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ