Dasara Special Trains 2023 in Telangana : దసరా పండుగ వచ్చిందంటే ప్రతి రైలు, బస్సు ప్రయాణికులతో నిండిపోతుంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రతి రైలు జనంతో కిక్కిరిసిపోతుంది. చాలా మంది ప్రయాణికులు రెండు నెలలు ముందే టికెట్లు కోసం ఎదురు చూస్తేనే ఉంటారు. పండగ వేళ ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
Dasara Special trains From Secunderabad : దసరా పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 621 సర్వీసులను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. పండుగ సెలవులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తీర్థయాత్రలు వెళ్లే వారికోసం కూడా పలు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అక్టోబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్లో 208 సర్వీసులు అందుబాటులో ఉంటాయని, జోన్ నుంచి 139 సర్వీసులను ఆపరేట్ చేస్తామని, మరో 141 సర్వీసులు జోన్ వరకు చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల వివరాలు :
రైళ్ల వివరాలు | ప్రత్యేక రైళ్ల సర్వీసులు |
అందుబాటులో ఉన్న సర్వీసులు | 208 |
జోన్ నుంచి ఆపరేట్ చేసేవి | 139 |
జోన్ వరకు చేరుకునేవి | 141 |
వేరే జోన్‌కి చెందిన రైళ్లు | 133 |
మొత్తం సర్వీసుల సంఖ్య | 621 |
621 Special Trains Start South Central Railway : వేరే జోన్లకు చెందిన మరో 133 ప్రత్యేక సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా వెళతాయన్నారు. మొత్తం 621 ప్రత్యేక సర్వీసులను దసరా పండుగ సందర్బంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ కౌంటర్ల(Ticket Booking Counters Increase)ను పెంచుతామని రైల్వే ప్రజా సంబందాల అధికారి పేర్కొన్నారు. సాధారణ సర్వీసులకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ఫారం టికెట్ ధరలను పెంచుతామన్నారు.
SCR Extends Festive Special Trains : పండగ స్పెషల్.. ఆ రైళ్లు పొడిగింపు..!
Dasara Special Trains Routes from Secundrabad : ప్రయాణికుల రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని రాకేశ్ అన్నారు. ఆర్పీఎఫ్ పోలీసుల నిఘా కూడా ఉంటుందని తెలిపారు.
ప్రత్యేక రైళ్ల రూట్ వివరాలు :
- సికింద్రాబాద్- తిరుపతి
- సికింద్రాబాద్- మచిలీపట్నం
- కాజీపేట్- తిరుపతి
- అకోలా- తిరుపతి
- హైదరాబాద్- నర్సాపూర్
- విజయవాడ- నాగర్ సోల్
- లింగంపల్లి- కాకినాడ
- సికింద్రాబాద్- గోరఖ్ పూర్
- సికింద్రాబాద్- రాక్సోల్
- సికింద్రాబాద్- అగర్తాల
- సికింద్రాబాద్- జైపూర్
- సికింద్రాబాద్- దానాపూర్
- కాచిగూడ- నాగర్ సోల్
- సికింద్రాబాద్- విశాఖపట్టణం
- తిరుపతి - శిర్డీ
- సికింద్రాబాద్- రామేశ్వరం
- జాల్నా- తిరుపతి వంటి ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నామన్నారు.
South Central Railway : ఈ వేసవి సెలవుల్లో.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
పండుగ ప్రయాణం.. అమ్మో మరీ ఇంతా ఖరీదా..!
SCR Special Trains: ఆగస్టులో వీక్లీ స్పెషల్ రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే